మొదటిగా నా ఇల్లు
( 1 రాజులు 15:11,12 )
“ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని.. పురుషగాములను దేశములోనుండి వెళ్ల గొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడ గొట్టెను.”
ఆసా యూదా సింహాసనాన్ని తీసుకొని అతని పూర్వీకులు అనుమతించిన విగ్రహాలు మరియు అన్యమత బలులను నిషేధించాడు.
అతడు , దేనివలనయితే యూదా దీవెనలు ఆపబడినాయో వాటికి ఒక ముగింపును పలికాడు. అయితే 10 లక్షల మంది శత్రు సైన్యం యూదాపై దాడి చేసినప్పుడు, ఆసా సహాయం కోసం దేవుని కోరుకున్నాడు, మరియు ప్రభువు వారిని ఓడించగా యూదా శత్రుసైన్యం సమృద్ధిని కొల్లగొట్టారు.
ఈ దినము నీ దీవెనలు ఎక్కడ ఆగియున్నాయి ? నీవు నీ గృహమును శుభ్రం చేయాలా ? మంచివి కాని కొన్ని విషయాలను నీవు పట్టించుకుంటున్నావా ? అవి నిన్ను ఆపడానికి ముందు నీవే వాటిని ఆపాలి. నీలో వున్న కోపం, అసూయ, చేదు, అనే ఒక క్లిష్టమైన ఆత్మను తొలగించాలి. వాటిని తీసివేయు, అప్పుడు దేవుడు నిన్ను కొత్త స్థాయికి తీసుకువెళతారు.
నీవు చేయలేని విషయాలు ఆయన జరిగేలా చేస్తారు. కొన్నిసార్లు మనము వెలుపల విషయాలు మనలను ఆపుతున్నాయి అనుకుంటాము .
కానీ మన లోపల వున్న శరీర కార్యములను తెలిసిన వాటిని తీసివేస్తే, కొత్త మార్గాల్లో దేవుని అనుకూలతను మనము చూడగలము.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రి, నేను నా జీవితం నుండి ఆ కార్యములను తొలగించడానికి ధైర్యముతో ఒక అడుగు వేయుచున్నందులకు వందనములు . నేను నా స్వంతంగా దానిని చేయలేను, అందువల్ల నాలో తోలగింపబడవలసిన వాటినన్నిటిని తీసివేయటానికి మీ సహాయం కోరుచున్నాను. మొదటిగా నా ఇల్లు శుభ్రం చేయసహాయం చేయుమని యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమెన్.