నీ చుట్టూ ఉన్న వ్యక్తుల

( ద్వితీయోపదేశకాండము 20:8 )
“ నాయకులు జనులతో యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.”

ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్లేముందు, దానికి భయపడి మూర్ఛపోయే వారిని వేరు చేయమని దేవుడు నాయకులకు చెప్పారు. ‘భయం’ వ్యాప్తి చెందుతుందని మరియు ఇతరులను నిరుత్సాహపరుస్తుందని, సైన్యాన్ని విజయానికి దూరంగా ఉంచుతుందని ఆయనకు తెలుసు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ధీరత్వము మరియు వైఖరి మనలను ప్రభావితము చేస్తాయి. అప్పుడు నీవు నీ చుట్టూ ఉన్న వ్యక్తుల వలె మారబోతున్నావు.
నీవు జ్ఞానులతో నడిస్తే జ్ఞానవంతునివి అవుతావని సామెతల గ్రంధము చెబుతోంది. అవి నిన్ను సానుకూలంగా మరియు ప్రతికూలంగా ప్రభావితము చేయగలవని నీవు గమనించాలి.

నీవు నీ సమయాన్ని ఎవరితో గడపడానికి ఎంచుకుంటున్నావో జాగ్రత్తగా చూసుకో. వారు ప్రతికూలంగా మరియు విమర్శనాత్మకంగా ఉంటే, వారు రాజీపడేవిషయాలుగాని మరియు వారిలో చిత్తశుద్ధి లేకుంటే, నిన్ను వారు తప్పుడు విషయాలకు ప్రభావితము చేసేవారిగా వుంటారు. మరియు నిన్ను తదుపరి స్థాయికి వెళ్లకుండా ఉంచబోతున్నారు. నీవు వారికి పెద్ద ప్రకటన చేసి దూరము అవ్వనవసరములేదు, కానీ నీవు వారితో తక్కువ సమయం గడపవలసి ఉంటుంది. నీవు తప్పు వ్యక్తుల నుండి నిన్ను నీవు వేరు చేసుకోకపోతే, నీవు సరైన వ్యక్తులను ఎప్పటికీ కలవలేవు. నిన్ను ప్రేరేపించి, నిన్ను సవాలు చేసి మరియు నీవు ఎదగడానికి కారణమయ్యే వ్యక్తులతో నీవు చుట్టుముట్టి వుండాలి.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రీ, నేను ఎదగడానికి మరియు ఉత్తమంగా ఉండటానికి నన్ను సవాలుచేసి మరియు ప్రేరేపించే సరైన వ్యక్తులను నా చుట్టు వుంచుతున్నందుకు మీకు వందనములు. నాతో నిజాయితీగా ఉండటానికి మరియు నేను ఎవరితో నా సమయాన్ని వెచ్చించాలి అనే విషయంలో నాకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నా జీవితంలోకి సరైన వ్యక్తులను తీసుకు వస్తారని నేను విశ్వసించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమెన్.