ఒక చీకటికాలం మాత్రమే
( యోబు 7:3 )
“ ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి.”
ఇతర పాత నిబంధన విశ్వాసవీరుల మాదిరిగానే, యోబు చీకటికాలములను కూడ గడిపాడు. తన కుమారులు మరియు కుమార్తెల యొక్క బాధాకరమైన నష్టం నుండి అతని వ్యాపారంలో జరిగిననష్టం మరియు తీవ్రమైన అనారోగ్యం ద్వారా అతని ప్రపంచం మొత్తం తల్లక్రిందులైంది. కష్టమైన, హృదయ విదారక సమయాల్లో మనలో చాలామంది చేసే పనినే యోబు చేశాడు. అతను కూడ సమస్యలపైననే దృష్టి సారించి, తప్పులనే పెద్దదిగా చూసుకుంటూ, అది అతనిని ముంచేలా చేశుకున్నాడు. యోబు మాట్లాడుతూ, " నేను అనుకున్నదే జరిగింది. నేను కష్టాల రాత్రులకే కేటాయించబడ్డాను. నా కథ ఇలానే ముగుస్తుంది. నేను ఇకపై ఆనందాన్ని అనుభవించలేను " అనుకుంటూ తను చేసిన తప్పులే శాశ్వతం అనుకున్నాడు.
నీవు ఎదుర్కొంటున్నది కష్టంగా ఉండవచ్చు, కానీ శుభవార్త ఏమిటంటే నీవు దానిని జయకరంగా ముగించనున్నావు. యోబునకు జరిగినదే నీకూ జరుగదు. ఇది ఒక చీకటికాలం మాత్రమే, ఈ చీకటి జీవితకాలం వుండేది కాదు. నీ గమ్యము నుండి నిన్ను దూరంగా ఉంచేదానిని దేవుడు అనుమతించరు. ఆయన నిన్ను తన అరచేతుల్లో ఉంచుకొని, ఇప్పటికే ఒక పరిష్కారాన్ని ఆయన కలిగి ఉన్నాడు మరియు నీ పురోగతి నీ మార్గంలోనే ఉంది. ఆయన ఇచ్చిన వాగ్ధానమునే పదేపదే ప్రకటిస్తూవుండు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, మీరు నా చీకటికాలాలకు కూడ దేవుడవు అయినందుకు మీకు వందనములు. నా మార్గంలో ఏది వచ్చినా, అది మీకు ఆశ్చర్యం కలిగించదని నేను నమ్ముతున్నాను మరియు మీరు ఇప్పటికీ నన్ను మీ అరచేతులలో కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు చీకటిగా ఉన్నప్పటికీ, పురోగతి రాబోతోందని అది దారిలోనే వుందని నేను నమ్ముతూ యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమేన్.