బంధకాలను తెంచుకునే
( న్యాయాధిపతులు 15:14 )
“యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను.”
న్యాయాధిపతులు 15 వ అధ్యాయములో, ఫిలిష్తీయులకు భయపడి, ఇశ్రాయేలీయులు తమ స్నేహితుడును మరియు విమోచంపగలవాడైన సమ్సోను వద్దకు వెళ్లి, మరిన్ని దాడులు జరుగకుండా ఆపడానికి అతడిని ఫిలిష్తీయులకు అప్పగించాలనే ఉద్దేశ్యంతో అతనిని కట్టివేసారు. ఫిలిష్తీయులు అతడు బంధించబడి వుండటాన్ని చూసినప్పుడు, ప్రభువు ఆత్మ సమ్సోనుపైకి వచ్చింది మరియు అతను వెయ్యి మంది ఫిలిష్తీయులను ఓడించే ముందు తాను కట్టబడివున్న ఆ తాళ్లను నూలు పోగువలే త్రెంచివేశాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అతడు శత్రువుల కంటే ముందు తన స్నేహితులు బంధించిన బంధకాలను త్రెంచివేశాడు.
ఒక్కోసారి మనకు అత్యంత సన్నిహితులే, మన కుటుంబ సభ్యులే, స్నేహితులే మనల్ని పరిమితం చేస్తుంటారు. "నువ్వు వున్న చోటనే వుండు అని, నువ్వు అంత ప్రతిభావంతుడివి కావని, నువ్వు ఎప్పటికీ అప్పుల నుండి బయటపడలేవని" వారు చెబుతుంటే, వారు నిన్ను మధ్యమత్వంలోనే కట్టిపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక "లేదు, నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్న ఏ శక్తి కంటే కూడ నాలోనున్న దేవుడు గొప్పదేవుడు" అని నీవు చెప్పాలి.
దేవుడు తన ప్రాణాన్ని నీలో ఊపిరిగా పోసినప్పుడు, నిన్ను అడ్డుకున్న బంధకాలను తెంచుకునే శక్తిని నీకు ఇచ్చారు. ఆయన నిన్ను సమ్సోనులాగా కొత్త భూమిని పొందే అభిషేకమును ఇచ్చారు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న అన్ని గొలుసుల కంటే గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని నా జీవితంలో ఇచ్చినందుకు మీకు వందనములు. దానికి మీరు నన్ను సన్నద్ధం చేశారని మరియు శక్తినిచ్చారని నేను నమ్ముతున్నాను. నేను మార్పు కోసం పుట్టానని నమ్ముచూ నన్ను బలపరచుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ! ఆమెన్.