ఈ దైవ వాక్యము మీరు తప్పకుండ విని అనేకులకు షేర్ చేయండి. దేవుని వాక్యము అందరు విని ప్రభువు తట్టు తిరగాలని కోరుకొంటున్నాము. మేము చేసే ఈ చిన్న పరిచర్య లో అనేకులకు గొప్ప ఆశీర్వాదములు కలుగును గాక ????
Elohim Church /Mettuguda /Secundrabad.
ప్రవచించటము ప్రారంభించు

( సంఖ్యాకాండము 24:10 )
“అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము.”

మోయాబీయుల రాజైన బాలాకు ఇశ్రాయేలీయులను శపించటానికి ప్రవక్తయైన బిలాముకు చాలా ధనమును ఇచ్చాడు. కానీ దేవుడు బిలాముతో మాట్లాడుతూ, "నేను దీవించిన వారిని నీవు శాపించలేవని “ చెప్పారు. బాలాకు బిలామును బలవంతము చేయటము కొనసాగించినప్పుడు, బిలాము శపించక పోవటమేగాక, దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా ఆశీర్వాదించారో మరియు వారి యెడల గొప్ప కార్యములను ఎలా చేశారొ మాట్లాడటం మొదలుపెట్టాడు.

దేవుడు నీపైన దీవెనను ఆజ్ఞాపించి చెప్పినప్పుడు, ఎవరైనా ఏమి చెప్పినా లేదా ఏమి చేసినా వాటితో పట్టింపు లేదు. అన్ని విషయాలలో సృష్టికర్తయైన దేవుడు నీపైన తన ఆశీర్వాదం ఉంచగా, మరి వేటికిని ఎటువంటి ప్రభావం లేదు. వారు రోజంతా ఓటమిని మాట్లాడగలరు, కానీ ఇక్కడ ముఖ్యమేమిటంటే : వారు నీ జీవితంలో దీవెనను మార్చటములో బలహీనంగా ఉన్నారు. బిలాము వలే శత్రువుని ప్రతికూల పదాలు మరియు ప్రతికూల ఆలోచనలతో నీ భవిష్యత్తును శపించుటకు ప్రయత్నించినప్పుడు, దేవుడు నీ కొరకు ఇచ్చిన విజయమును, అనుకూలతను , ఆరోగ్యంను , సమృద్ధిని ప్రవచించటము ప్రారంభించు. నీవు విధేయతలో నడిచినప్పుడు, దేవుని దీవెనలు నిన్ను వెంటాడి, నీకు ఇదివరకువున్న దీవెనలను అధిగమిస్తాయి.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా : తండ్రి, నేను నీకు చెందినందున నా జీవితంలోనికి మీరు ఆజ్ఞాపించబడిన ఆశీర్వాదములను పంపుచున్నందులకు వందనములు. మీ ఆశీర్వాదం, నన్ను తిరిగి పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న ఏ శక్తి కంటెను గోప్పదని నమ్ముచున్నాను.
నేను మిమ్మల్ని ఘనపరచుచున్న కొలది, మీ దీవెనలు నాలో అధిగమించుతాయని నమ్ముచూ యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమెన్.