వాక్యములను జాబితాగా

( సంఖ్యాకాండము 23:19 )
“ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?”

నీవు దేవుని వాగ్దానాల గురించి మాట్లాడే దానికంటే నీ సమస్యల గురించి మాట్లాడటానికి ఎక్కువ సమయం గడుపుతుంటే, దానిలో సమతుల్యత లేదు. "దేవుడు తన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నారు" అని లేఖనములు శెలవిస్తున్నాయి .
దేవుడు మన ఫిర్యాదులను వినేటట్లు "దేవా, దయచేసి ఇది సరైంది కాదు. నీవు దీన్ని తీసివేయాలి " అని మనము వేడుకోవాలని అందులో చెప్పలేదు. అవును, ఆయన మనలను గూర్చి చింతించి మరియు తప్పులను చూస్తుంటారు, అయిన నీవు ఆయన మాటలే మాట్లాడటం దేవుడు విన్నప్పుడు అదే చర్య తీసుకునేలా ఆయనను కదిలిస్తుంది.
ఆయన వాగ్దానం చేసిన వాటినిబట్టి నీవు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి నిశ్చయించుకోవటమే చాలా శక్తివంతమైన కార్యము .

దేవుడు నీకు వాగ్దానం చేసిన వాక్యములను జాబితాగా తయారు చేసి, దానిని నీ ఫోన్‌లోను, నీ బాత్రూమ్ అద్దం మీద మరియు నీ కంప్యూటర్‌లో ఉంచుకో మరియు దినమంతా ఆయనను స్మరించుకో. దేవుడు గతంలో ఎప్పుడూ విఫలం కాలేదు మరియు అది నీతో ప్రారంభించరు. ఆ ప్రతికూల ఆలోచనలు తీసివేసికో . ఆయన వాగ్ధానములు నీవనుకున్న మార్గంలో లేదా నీ కాలక్రమము‌లో జరగకపోవచ్చు, కానీ దేవుడు తన వాక్యానికి నెరవేర్చటములో ఆయన నమ్మదగినవాడు. "దేవా, నీవు వాగ్దానం చేసిన దానినిబట్టి " అని నీవు నిరంతరం చెబుతున్నప్పుడు, ఆ విశ్వాసము ఆయన వాగ్దానాలను నెరవేర్చడానికి అనుమతిస్తుంది.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నేను ఊహించిన దానికంటే ఎక్కువగా మరియు అంతకు మించి మీరు చేస్తానని వాగ్దానం చేసినందుకు వందనములు. మీ మాటకు కట్టుబడి మరియు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో మీరు ఎన్నడూ విఫలం కానందుకు మీకు వందనములు. మీ వాక్యాన్ని నా జీవితంలో అమలు చేయడానికి మీరు చూస్తున్నారని నేను నమ్ముతూ యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి !ఆమెన్.
daily devotion#elohim #church #audiomessage #god #bless #you