నీవున్నపరిస్థితులు అసాధ్యమని
“యెహోవా- నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.”( న్యాయాధిపతులు 7:2 )
గిద్యోనును తన సైన్యాన్ని ముప్పై రెండు వేలమంది నుండి పదివేలకు తగ్గించుకొనెను.
ఆపై ఇంకా కేవలం మూడువందల మందికి తగ్గించమని దేవుడు గిద్యోనుకు ఆదేశించినప్పుడు, ఆ సమయములో లక్షా ముప్పైఐదు వేలమంది శత్రు సైన్యం గిద్యోను సైన్యంపై దాడి చేయబోతోంది. గిద్యోను దాదాపుగా ఆశలు వదలుకున్నాడు. ఈ అసమానత వలన అది అసాధ్యం అనిపించింది. అయితే జీవితంలో గొప్ప విజయంను చూపించడానికి దేవుడు తనను ఏర్పరచుకున్నారని గిద్యోను గ్రహించలేదు.
నీవు కూడ అటువంటి అసమానమైన పరిస్థితుల్లో ఉన్నట్లు అనిపిస్తుంటే ఆశ్చర్యపోకు.
నీకు మార్గం కనబడక పోవచ్చు. అయితే దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచివున్నారు. అక్కడ నీ వలన జరిగిన కార్యములను చూచిన వారందరికి అది ప్రభువు హస్తమని తెలుస్తుంది. నీవున్న పరిస్థితులు అసాధ్యమని నీకు అనిపించినప్పుడు, నిరుత్సాహపడక, దేవా, ఎందుకు ఇలా జరుగుతుంది ? అని అనుకొనకుండా, సిద్దపడు.
నీ జీవితంలో దేవుడు తన శక్తిని చూపించడానికి మరియు నిన్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి నీవు సరైన స్థితిలో ఉన్నావు. అద్భుతమైన మార్గాల్లో ఆయన అనుగ్రహాన్ని చూపించడానికి ఆయన నిన్ను ఏర్పరచు కున్నారు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా: తండ్రీ, నా మార్గంలో ఉన్న అడ్డంకులు నేను నిర్వహించగలిగే దానికంటే పెద్దవిగా, బలంగా మరియు శక్తివంతంగా కనిపించినప్పుడు, ఎదురుదెబ్బలు ఎలా ఉన్నా మీరు వాటిని నా దాగుచోటులుగా మారుస్తారని వందనములు. నేను ఎప్పటికీ చేయలేని విషయాలను అద్భుతమైన మార్గములో మీరు చేయబోతున్నారని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్ధించుచున్నాను తండ్రి ! ఆమేన్.